శ్రీ విఘ్నేశ్వర భక్తి సుమాలు
స్వస్ది శ్రీ విజయ నామ సంవత్సరము
శ్రావణ మాసం శుద్ద చతుర్ది
(10-08-2013)
నాల్గవ సంచిక
ప్రార్దనా పద్యము:
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన! నీకు మ్రొక్కెదన్
ఫలెతము సేయమయ్య నిను ప్రార్ధన చేసెదనేకదంత! నా
వలపటి చేతిఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా!!
శ్రీ గణేష వందనం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
I
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నౌపశాంతయే
I I -1
అగజాననపద్మార్కం గజాననమహర్నిశమ్ I
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
I I -2
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ I
నిర్విఘ్నంకురుమే దేవ! సర్వకార్యేషు సర్వదా I
I -3
చతుర్భుజం మహాకాయం గజవక్త్ర్రం శుభంకరమ్
I
భక్తానాం వరదం ధ్యాయేత్ మహాగణపతిం విభుమ్ I
I -4
స జయతి సింధురవదనోదేవో యత్పాద పంకజ స్మరణమ్
I
వాసరమణిరివ తమసాం రాశీన్నాశయతి విఘ్నానామ్
I I -5
గజాననాయ మహతే ప్రత్యూహతిమిరచ్చిదే
అపార కరుణాపూర తరంగిదృశే నమ:
-6
గజాననం భూత గణాధి సేవితం కపిత్ఠ జంబూఫలచారుభక్షణమ్ I
ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వరపాదపంకజమ్
I I -7
త్వాం విఘ్నశత్రుదలనేతి చ సుందరేతి భక్తప్రియేతిసుఖదేతి ఫలప్రదేతి
I
విద్యాప్రదేత్యఘహరేతి చ యే స్తువంతి తేభ్యో గణేష వరదో భవ నిత్యమేవ
I I -8
ఇతి శ్రీ గణేష వందనమ్
వినాయక తత్త్వం
వినాయకుణ్ణి ధారణచేసి మనం కొంచెం యెచిసై, ప్రతి చిన్నవిషయంలోనూ ఆయనను గూర్ఛి మనకోక తత్త్వం నయన పర్వంగా దీపిస్తుంది. వినాయకునికి మనం కొబ్బరికాయలు కొడతాం ఎందుకు? ఒకప్పుడు విఘ్నేశ్వదుడి తండ్రియైన పరమశివుని చూచి "నాకు నీ తలనుబలిగా ఇవ్వు" అని అడిగాడుట. తలను ఉత్తమాంగం అని అంటారు. మనకున్నవస్తువులలో పరమశ్రేష్టమైన వస్తువును త్యాగం ఛెసి అర్పిస్తేకదా అది భక్తి. ఈశ్వరుడు త్రయంబకుడు - మూడు కళ్ళవాడు. తన తలకు ఈడైన వస్తువు నొకటి ఈశ్వరుడు సృష్టించాడు. ఆ వస్తువే మూడు కళ్ళ కొబ్బరికాయ."వినాయకునికి మీరు కూడా మూడు కళ్ళ కొబ్బరికాయ కొట్టండి." అని ఈశ్వరుడు అనుగ్రహించిన్నట్లువున్నది.
తమిళనాడులో కొబ్బరికాయ జుట్టును పూర్తిగా తీసివేసి ఒక్కవ్రేటులో పగిలేటట్లు కొట్టడం ఒక అలవాటు. దానిని వాళ్ళు - "సిదిర్ టేంగాయ్" అని వ్యవహరిస్తారు. కొబ్బరికాయను పగలకొడితే అందులోని నారికేళజలం లభించిన్నట్లు అహంకారం అణిగితే ఆత్మానుభూతి కలుగుతుంది.
గణపతిది స్దూలదేహం. ఆయన నామాలలో స్దూలకాయుడు అన్నదొకటి. ఆయన పర్వతంవలే వున్నడు. కాని అతడేమో చిన్నబిడ్డ. బిడ్డలకు పుష్టి యే ఆనందం. గణపతి వాహనం ఎలుక.ఈయన ఎంత స్దూలకాయుడో, అది అంత సూక్ష్మమైన దేహం కలది. ఈయనకు వాహనం వలన వచ్చేగౌరవం ఏమిలేదు. స్దూలకాయుడైనా, తన వాహనానికి ఏ విధమైన శ్రమవుండరాదని, లఘిమాసిద్దితో బెండువలె తెలికగావుంటాడు. అదొక విశేషం.
ఒక్కొక్క ప్రాణికి, ఒక్కొక్క విషయంలొ ప్రితీ. చమరీ మృగానికి తోక అంటే ప్రితి. నెమలికి ఫించమే బంగారం. ఏనుగుకు దంతాలంటే ప్రాణం. కానీ మన గణపతి మహాభారత రచనా సందర్భములో తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడబెరికి, దానిని కలంగాచేసుకొని వ్యాసులవారు గంగా స్రవంతిలాగ భారతాన్ని కవనం చేస్తుంటే, పద్దెనిమిది పర్వాలు చక చకా వ్రాసి ముగించి వేసాడు.
"ఆనందాద్చ్యేస ఖల్విమాని భూతాని జాయంతే." పార్వతీ పరమేశ్వరుల ఆనందార్ణవంలో నుంచి ఉద్భవించినవీచికల వంటివాడు మన గణపతి. శ్రీదేవి సేనలను ప్రతిఘటించడానికి భండాసురుడు ఒక విఘ్నయంత్రాన్ని రణ మధ్యంలొ స్దాపించాడు. ఆ సమయంలొ లలితాదేవి కామేశ్వరుని చూచి ఆనందంగా ఒక నవ్వు నవ్వింది.ఆ హాసచంద్రికలనుండి ఒక దేవుడు. మదజలాక్త కుంభస్ధలంతో గజాననుడై పుట్టాడు. ఆ దేవుడు ఇరువది ఎనిమిది అక్షరముల మంత్రానికి అధిపతి. భండాసురుని విఘ్నయంత్రాలను క్షణంలో భగ్నంచేసి తల్లికి ఎనలేని సహాయం చేశాడు.
ఏకార్యం తలపెట్టినా మనం విఘ్నేశ్వరుని ముందు తృప్తి పరచాలి. ఆయన అనుగ్రహం వుంటే, అన్నీ అనుకూలంగా సమాప్తమౌతాయి. అన్నింటికి ఆదిదైవం ఆయనే.గణపతిని పధానమూర్తిగా ఉపాసించేవారిని గాణాపత్యులని అంటారు.
వినాయకుని ముందు మనం గుంజీళ్ళు తీస్తాం. సంస్కృతంలొ దానిని "దోర్భి:కర్ణ"మని అంటారు. దోర్భి అంటే చేతులు కర్ణమంటే చెవులు. చేతులతో చెవులను పట్టుకొని గుంజీలు తీయటం. ఒకప్పుడు మహా విష్ణువు వైకుంఠంనుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేన్నల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కొని ఎంత వేడినా తిరిగి ఇవ్వలేదుట. మహావిష్ణువుకు ఏమిచేయడానికి తోచక తన రెండు చెవులను, నాలుగు చేతులతో పట్టుకొని గుంజిళ్ళు తీసారుట. ఈ విచిత్ర చర్యకు వినాయకుడు దొర్లిదొర్లి నవ్వాడుట. చిన్నబిడ్డకదా!. సుదర్శన చక్రం విషయం మరిచిపోయాడు. అంతటితో అమ్మయ్యాఅని చక్రంతో బాటు విష్ణువు బయటపడ్డాడు.
ఏకార్యమైనా అవిఘ్నంగా జరగాలంటే విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగావుండాలి. అందుకె అయనకు "యం సత్వాకృతకృత్యాశు తం నమామి గజాననం" అన్న ప్రశస్తి.
( కంచి కామకోటి పీటాదిపతులు జగద్జురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి "సనాతన ధర్మము" నుండి)