Tuesday, September 3, 2013

నాల్గవ అధ్యాయము జ్ఞాన, కర్మ, సనన్న్యాస యోగ:

నాల్గవ అధ్యాయము

జ్ఞాన, కర్మ, సనన్న్యాస యోగ:

( 1 నుండి 18 శ్లోకములవరకు - సతుణ పరమేశ్వరుని ప్రభావము, నిష్కామ కర్మయోగ విషయము . 19 నుండి 23 వరకు యోగులైన మహత్ముల అచరణము వారి మహిమలు,  24 నుండి 32 వరకు  వేర్వేరు యజ్ఞఫలముల వివరణలు,  33 నుండి 42 వరకు జ్ఞానప్రభావము వివరింప బడినవి)

శ్రీ భగవాన్ ఉవాచ:

 (తేది: 04.09.2013)

ఇమం వినస్వతే యోగం ప్రోక్తవానమవ్యయమ్ 
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకనే బ్రవీత్ ( 4-1)

శ్రీ భగవానుడు ఇట్లు పలికెను: నేను నిత్యసత్యమైన యోగమును సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వతమనువుకు దీనిని భోదించెను. మనువు తన్ కుమారుడైన ఇక్ష్వాకునకు ఉప దేశించెను.


(తేది: 05.09.2013)
ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదు:
సకాలేనేహ మహతా యోగో నష్ట్: పరంతప (4-2)


పరంతపా! (అర్జునా) విధముగా పరపరాప్రాప్తమైన పరంపరాప్రాప్తమైన యోగమును రాజర్షులు ఎరింగిరి. కాని అనంతరము యోగము కాలచక్రమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యేను.


(తేది: 06.09.2013):
ఏవం మయా తేద్య యోగ: ప్రోక్త: పురాతన:
భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ( 4-3)

యోగమము ఉత్తమైనది. రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడువు. ప్రియసఖుడవు.కనక మిక్కిలి పురాతనమైన యోగమును నీకు తెలుపుచుంటిని.

(తేది: 07.09.2013):
బహూని మేవ్యతీతాని జన్మాని తన చార్జున 
తాన్యహం వేద సర్వాణి త్వం వేత్ద పరంతప (4-5)

పరంతపా! అర్జునా! నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కాని వాటిని అన్నింటిని నేను ఎఱుంగుదును.నీ వెఱుగవు.

(తేది: 08.09.2013):

అజోపి సన్నవ్యయాత్మా భూతానామీస్వరోపి సన్
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయమా (4-6)

నేను జన్మరహితుడును, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయినను నాప్రకృతిని అధీనములోనుంచుకొని, నా యేగమాయ చే అవతరించుచుందును.

(తేది: 09.09.2013):

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత 
అభ్యుత్దానమధర్మస్య్ తదాత్మానం సృజామ్యహమ్ (4-7)

భారతా! (అర్జునా) ధర్మమునకు హాని కక్లిగినప్పుడును, ధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును. అనగా సాకారముతో లోకమున అవతరింతును.

(తేది: 10.09.2013):

 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్యృతామ్
ధర్మసంస్ధాపనార్ధాయ సంభవామి యుగే యుగే (4-8)

సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్ధిరమొనర్చుటకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును.

(తేది: 11.09.2013):

జన్మ కర్మ చమే దివ్యమ్ ఏవం యోవేత్తి తత్త్వత:
త్వక్త్యాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున (4-9)

అర్జునా! నా జన్మ (అవతారము)లు, కర్మములు, దివ్యములు. అనగా నిర్మలములు. అలౌకికములు. తత్త్వరహస్యమును తెలిసికొనినవాడు తనువును చాలించిన పిమ్మట్ట మఱల జన్మింపడు సరికదా! నన్నే చేరును
(తేది: 12.09.2013):

వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా:
బహనో జ్ఞానతపసా పూతా మద్బావమాగతా: (4-10)

ఇదివరలోగూడ సర్వదా రాగభయక్రోధరహితులైనవారు, దృఢమైన భక్తి తాత్ప్రర్యములతో స్ఢిరబుద్ది గలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్పంన్నులై పవిత్రులై నా స్వరూపముపోందియుండిరి.

(తేది: 13.09.2013):

యే యధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్య్హహమ్
మమ వర్త్మానువర్తంతే మనుష్యా: పార్ధ సర్వశ: (4-11)

పార్దా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును వివిధరీతులలో నా మార్గమునే అనుసరింతురు.

(తేది: 14.09.2013):

కాంక్షంత: కర్మణాం సిద్దిం యజంత ఇహ దేవతా:
క్షిప్రం హి మానుషే లోకే సిద్దిర్భవతి కర్మ్హజా ( 4-12)

ఈ లోకమున కర్మఫలములను ఆసించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మలవలన కలుగు సిద్దివారికి శీఘ్రముగా లబించును.

(తేది: 15.09.2013):

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ:
తస్య కర్తారమపి మాం విద్ద్యకర్తారమవ్యయమ్ (4-13)

బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య, శూద్ర వర్ణములవారిని వారి గుణకర్మలననుసరించి వేర్వేరుగా సృష్టించితిని. సృష్టి కార్యక్రమమునకు నేనే, కర్తను, శాశ్వతుడను పరమేశ్వరుడను ఐన నన్ను వాస్తవముగా 'అకర్తను' గా తెలుసుకోనుము.

(తేది: 16.09.2013):

మాం కర్మాణి లింపంతి మే కర్మఫలే స్సృహా
ఇతి మాం యోభిజానాతి కర్మభిర్నస బధ్యతే  (4.14)

నాకు కర్మఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్నంటవు. విధముగా నా తత్త్వమును తెలిసిన వారు కర్మ బద్ధులు కారు

(తేది: 17.09.2013):

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి:
కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై: పూర్వతరం కృతమ్ (4-15)

అర్జునా! ప్రాచీనులైన ముముక్షువులు విధముగా ( నా తత్వ రహస్యమును) దెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును పూర్వలవలెనే నిష్కామ భావముతో కర్మల నాచరింపుము

(తేది: 18.09.2013):

కిం కర్మ కిమకర్మేతి కవయో ప్యత్ర మోహితా:
తత్తే కర్మ ప్రవక్షామి యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్ (4-16)

కర్మ అనగానేమి? అకర్మ అనగానేమి? విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరిచెదను. దానిని తెలిసికొని నీవు అశుభములనుండి  అనగా కర్మభంధములనుండి ముక్తుడవయ్యెదవు

(తేది: 19.09.2013):

కర్మణో హ్యపి బోద్ధవ్వం బోద్దవ్వం వికర్మణ
అకర్మణశ్చ బోద్దవ్వం గహనా కర్మణో గతి: (4-17)

"కర్మ" తత్త్వమును తెలిసికొనవలెను. అట్లే "అకర్మ" స్వరూపమునుకూడ ఎరగవలెను."వికర్మ" లక్షణములను తెలిసికోనుట చాలా అవసరముఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది.

(తేది: 20.09.2013):

కర్మణ్యకర్మ : పశ్యేత్ అకర్మణి కర్మయ:
బుద్దీమాన్ మనుష్యేషు యుక్త: కృత్స్నకర్మకృత్ (4-18)

కర్మయందు "అకర్మను" అకర్మయందు "కర్మ" ను దర్శీంచువాడు మానవులలో బుద్దిశాలి. అతడు యేగి మఱియు సమస్త కర్మలు చేయువాడు.

(తేది: 21.09.2013):

యస్య సర్వే సమారంభా: కామసంకల్పవర్జితా:
జానాగ్నిదగ్డకర్మాణాం తమాహు: పండితం బుధా: (4-19)

ఎవని కర్మలన్నియును, శాస్త్ర సమత్మములై, కామసంకల్పవర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నియును, జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు.

(తేది: 22.09.2013):

త్వక్త్యా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ:
కర్మ్ణణ్యభిప్రవృత్తోపి నైవ కింఛిత్ కరోతి : (4-20)

సమస్తకర్మలయందును వాటిఫలితములయందును సర్వధా ఆసక్తిని విడి సంసార - ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్యతృప్తుడైన పురుషుడు , కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైన ప్పటికిని వాస్తవముగా వాటికి (కర్మలకు) కర్త కాడు.  

(తేది: 23.09.2013):

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహ:
శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నొతి కిల్భ్షమ్ (4-21)

అంత: కరణమును, శరీరేంద్రియములను జయించినవాడు, సమస్తభోగసామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడును ఐన  సాంఖ్యయేగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు.

(తేది: 24.09.2013):

యదృచ్చాలాభసంతుష్టొ ద్వంద్వాతీతో విమత్సర:
సమ: సిద్ధావసిద్దౌ కృత్వాసి నిబధ్యతే (4-22)

తాను కోరకుండగానే లభించిన పదార్దములతో (అప్రయత్నముగా అమరిన లాభములతో) సంతుష్టుడైనవాడు, హర్షశోకాదిద్వంద్వములకు అతీతుడు అయినవాడు, అసూయలేనివాడు  సిద్దియుందును, అసిద్దియందును సమదృష్టికలిగివుండును. అట్టి కర్మయేగి కర్మలనాచరించుచున్నను వాటి భందములలో చిక్కుపడడు.

(తేది: 25.09.2013):

గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్దితచేతస:
యజ్ఞాయా చరత: కర్మ సమగ్రం ప్రవిలీయతే ( 4-23)

ఏలనన ఆసక్తి, దేహాభిమానము, మమకారము మాత్రము లేనివాడును, పరమాత్మజ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును, కేవలము యజ్ఞానర్దమే  కర్మలను అచరించువాడును అగు మనుష్యునియొక్క, కర్మలన్నియును పూర్తిగావిలీనములగును అనగా మిగిలియుండవు.

(తేది: 26.09.2013):

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ర్బహాగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా (4-24)

యజ్ఞకార్యములయందు ఉపయుక్తమగు స్రువాది సాధనములు బ్రహ్మము. యజ్ఞము ఆచరించు కర్తయు బ్రహ్మము.హవనక్రియయు బ్రహ్మము. బ్రహ్మకర్మయందు స్దితుడై యుండు యేగిద్వార పోందదగిన యజ్ఞఫలముకూడా బ్రహ్మమే

(తేది: 27.09.2013):

దైవమేవాసరే యజ్ఞం యోగిన: పర్యుపాసతే 
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి (4-25)

కొందరు యోగులు దైవపూజారూపమున యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు.మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మపరమాత్మరూపాగ్నియందు అభేదదర్శన రూపయజ్ఞముద్వారా ఆత్మరూపయజ్ఞమును ఆచరింతురు


(తేది: 28.09.2013):

శ్రోత్రాదీనీం ద్రియాణ్యన్యేసంయమాగ్నిషు జుహ్వతి
శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిష్య్ జుహ్వతి (4-26)

కొందరు యోగులు శ్రోత్రాది - ఇంద్రియములను సంమయమున రూపాగ్నులయందు హోమము చేయుదురు.మరికొందరు యోగులు శబ్దాది సమస్తవిషయములను ఇంద్రియరూపాగ్నులయందు  హవనము చేయుదురు. అనగా మనోనిగ్రహముద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు.తత్ఫలితముగా శబ్దాదివిషయములపై ఎదురుగాఉన్నను లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రమువుండదు.

(తేది: 29.09.2013):
సర్వాణీంద్రియకర్మాణీ ప్రాణకర్మాణి చాపరే
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపతే (4-27)

మఱికొందరు యోగులు ఇంద్రియములక్రియలను, ప్రాణములక్రియలను అన్నింటిని జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మసంయోగరూపాగ్నిలోహవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్దితులైవుందురు. అప్పుడు ప్రాణ-ఇంద్రియ క్రియల ప్రభావము వారిపై ఏమాత్రమువుండదు. ఏలనన వారిబుద్దియందు పరమాత్మమాత్రమే నిలిచియుండును.


(తేది: 30.09.2013):

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తధాపరే 
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయ: సంశితవ్రతా: (4-28)

కొందఱ ద్రవ్యబంధయజ్ఞములను, మఱికొందరఱు తపో- రూప యజ్ఞములను, కొందఱు యోగరూప యజ్ఞములను చేయుదురు. మఱికొందరు అహింసాదితీక్షవ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయరూపజ్ఞానయజ్ఞములను ఆచరింతురు.


(తేది: 01.10.2013):

అపానే జుగ్వతి ప్రాణం ప్రాణే పానం తధాపరే 
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణా: (4-29)

అపరే నియతాహారా: ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి 
సర్వే ప్యేతే యజ్ఞనిదో యజ్ఞక్షపితకల్మషా: (4-30)

 కొందరు యోగులు అపాన వాయువునందు  ప్రాణవాయువును, మఱికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకను కొందరు నియవితాహార నిష్టితులై, ప్రాణాయామ పరాయణులైనవారు ప్రాణాపానగమనములను నిలిపి ప్రాణములను, ప్రాణాములయందే హవనము చేయుదురు. యజ్ఞవిదులైన ఈసాధకులందఱును యజ్ఞములద్వారా పాపములను రూపుమాపుదురు

(తేది: 02.10.2013):

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మసనాతనమ్ 
న్యాయంలోకో స్త్యయజ్ఞస్య కుతోవ్య: కురుసత్తమ (4-31)

ఓకురుసత్తమా! (అర్జునా) యజ్ఞపూతశేషమైన అమృతమును అనుభవించుయోగులకు సనాతనుడును, పరబ్రహ్మమును అగు పరమాత్మయెక్క లాభము కలుగును. యజ్ఞము చేయనివారికి ఈమర్త్యలోకమే సుఖప్రదము కాదు. ఇంక పరలోక విషయము చెప్పనేల?

(తేది: 03.10.2013):

ఏవం బహువిధాయజ్ఞావితతా బ్రహ్మణోముఖే
కర్మజాన్ విద్ది తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వావిమేసక్షసే (4-32)


ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈయజ్ఞములన్నింటిని త్రికరణసిద్దిగా (మనోవాక్కాయములచే) ఆచరింపబడినప్పుడే అవి సుసంపన్నములగునని తెలిసికొనుము. ఇట్లు కర్మతత్త్వమును తెలిసికొని అనుష్టించుటవలన నీవు ప్రాపంచిక (కర్మ) బంధమునండి సర్వధా విముక్తుడవయ్యెదవు.

(తేది: 04.10.2013):

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ: పరంతప
సర్వం కర్మాఖిలం పార్ఢ జ్ఞానపరిసమాప్యతే (4-33)

పరంతపా! అర్జునా! ద్రవ్యమయయజ్ఞముకంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నియును జ్ఞానమునందే పరిసమాప్తమగును


(తేది: 05.10.2013):

తద్విద్ది ప్ర్ణణిపాతేన పరిప్రశ్రేన సేవయా
ఉపదేక్ష్యంతి జ్ఞానం జ్ఞానినస్త్త్వదర్శిన: (4-34)

నీవు తత్త్వమును దర్శంచిన జ్ఞానుల కడకేగి, జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణాముములాచరించుట వలనను, సేవలొనర్చుటవలనను, కపటములేకుండా భక్తి శ్రద్దలతో సముచిత రీతిలో ప్రశ్నించుటవలనను పరమాత్మతత్వమును చక్కగా నెఱింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు పరమాత్మత్వజ్ఞానమును ఉపదేశించెదరు.
(తేది: 06.10.2013):

యద్ జ్ఞాత్వా పుఅర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ 
యేన భూతన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యధో మయి ( 4-35)

అర్జునా! ఈతత్వజ్ఞానమునెరింగినచో ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. జ్ఞానప్రభావముతో సమస్తప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘనపరమాత్ముడైన నాలో చూడగలవు.

అపి చేదసి పాపేభ్య: సర్వేభ్య: పాపకృత్తమ:
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి (4-36)

ఒకవేళ పాపాత్ములందరికంటెనూ నీవు ఒకమహాపాపీఅయినచో జ్ఞాననౌక సహాయముతో పాపసముద్రమునుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు.

యధైధాంసి సమిద్దోగ్ని: భస్మసాత్కురుతేర్జున
జ్ఞాగ్ని: సర్వకర్మాణి భస్మసాత్కురుతేతధా (4-37)

అర్జునా! ప్రజ్వలించుచున్న అగ్ని సమిధలను భస్మముచేసినట్లు జ్ఞానమను అగ్నికర్మల న్నన్నింటిని భస్మమొనరించును

నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే
తత్స్యయం యేగసంసిద్ద: కాలేనాత్మని విందతి (4-38)

ప్రపంచమున జ్ఞానముతో సమానమగ పవిత్రమైనది మరియొకటి లేనేలేదు. శుద్దాంత:కరణముగల సాధకుడు బహుకాలమువరకు కర్మయేగాచరణము చేసి, ఆత్మయందు అదే జ్ఞానమును తమంతటతానే పొందగలడు.

శ్రద్దావాన్ లభతే జ్ఞానం తత్పర: సంయతేంద్రియ:
జ్ఞానం లబ్ద్వా, పరమ్ శాంతిమచిరేణధిగచ్ఛ్తితి  (4-39)

జితేంద్రియుడు, సాధనపరాయణుడు శ్రద్దళువునైన మనుజునకు భగవత్తత్త్వ జ్ఞానము లభింఛును. ఆజ్ఞానముకలిగినవెంటనే ( ఏమాత్రము విలంబము లేకుండ) అతడు భగవత్తత్త్వరూపమైన పరమశాంతిని పొందును.

అజ్ఞాశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి
నాయం లోకోస్తి పరో సుఖం సంశయాత్మన: (4-40)

అవివేకియు, శ్ర్డ్డద్దారహితుడును ఐన సంశయాత్ముడు పరమార్ధవిషయమున ఆవశ్యముభ్రష్టుడే అగును. అట్టి సంశయాత్మునకు లోకమున గాని పరలోకమున గాని ఎట్టిసుఖము వుండదు.

యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయయ్
ఆత్మవంతం కర్మాణి నిబధ్నంతి ద్దనంజయ ( 4-41)

ధనంజయ! ( అర్జునా!) విధిపూర్వకముగ కర్మలను ఆచరించుచు, కర్మఫలములను అన్నింటిని భగవదర్పణము చేయుచు, వివేకముద్వారా సంశయములన్నింటిని తోలగించుకోనుచు అంత:కరణమును వశమునందుంచుకొనిన వానిని కర్మలు బందింపజాలవు

తస్మాదజ్ఞానసంభూతం హృత్ సస్ధం జ్ఞానాసినాత్మన:
ఛిత్వైనం సంశయం యోగమ్ అతిష్డోత్తిశష్ఠ భారత ( 4-42)

కావున భారతా ( అరునా!) నీహృదయమునందుగలాజ్ఞానజనితమైన సంశయమును వివేకజ్ఞానమనుఖడ్గముతో రూపుమాపి, సమత్వరూప కర్మయోగమునందు స్టితుడవై యుద్దమునకు సన్నద్దుడవగుము.

ఓం తత్సదితి శ్రీమద్భగద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్ర్తే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మసన్న్యాసయోగోనామ చతుర్డొద్యాయ









No comments:

Post a Comment