శ్రీమద్భగవద్గీత
రెండవ అధ్యాయము- సాంఖ్యయెగము
Date
|
Verse
|
SANSKRIT
|
TELUGU
|
MEANING
|
29.05.2013
|
3
|
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते ।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप I I | క్లైబ్యం మాస్మ గమ: పార్ధ నైతత్త్యయుపపద్యతే I క్షుద్రం హృదయదౌర్భల్యం త్వక్త్వోత్తిష్ట పరంతప II |
కావున ఓ అర్జునా! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతప! తుచ్చమైన ఈ హృదయదౌర్భల్యం ను వీడి, యుద్దమునకై నడుము బిగింపుము
|
30.05.2013
|
11
|
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे ।
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः II |
అశోచ్యానన్వశోచస్త్యం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశొచంతి పండితా:
|
ఓఅర్జునా! శోకింపదగని వారికొఱకు నీవు శోకించుచున్నావు. పైగా పండితునివలె మాట్లాడుతున్నావు. పండితులైనవారు ప్రాణములు పొయిన వారి గూర్చి గాని, ప్రాణములు పోని వారిని గుఱించి గాని శోకింపరు.
|
31.05.2013
|
12
|
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः ।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम् |
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాదిపా:
న చైవ న భవిష్యామ: సర్వే న యమత: పరం
|
నీవు గాని నేను గాని, ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడ మనము ఉండము అనుమాటయే లేదు ( అన్ని కాలములలోను మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలముల యందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు.)
|
01.06.2013
|
13
|
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा ।
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति |
దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనం జరా I
తధాదేహాంతరప్రాప్తి: ధీరస్తత్ర న ముహ్యతిII
|
జీవాత్మకు ఈదేహమునందు కౌమారము, యౌవనము, వార్దక్యమూ ఉన్నట్లై మఱియొక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈవిషయమున మెహితుడు కాడు.
|
02.06.2013
|
14
|
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः ।
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत ॥ |
మాత్రాస్వర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదు:ఖదా: I
ఆగమాపాయనో నిత్యా: తాంస్తితిక్షస్వ భారత II
|
ఓ కౌంతేయ! విషయేంద్రియ సం యెగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీ లములు. అనిత్యములు. కనుక భారతా! వానిని సహింపుము
|
03.06.2013
|
15
|
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥२- १५॥ |
యం హి న వ్యధయంత్యే తే పురుషర్షభ I
సమదు:ఖసుఖం దీరంసోమృతత్యాయ కల్పతే II
|
ఓ పురుషశ్రేష్టా! ధీరుడైనవాడు సుఖ దు:ఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయేగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు.
|
04.06.2013
|
16
|
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ।
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः ॥ |
నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత:I
ఉభయోరపి దృష్టొంత: త్ననయోస్తత్వద్శిభి:II
|
అసత్తు అనుదానికి (అనిత్యమైనదానికి) ఉనికియేలేదు. సత్తు అనుదానికి లేమి లేదు. ఈవిధముగా ఈ రెండింటికి వాస్తవరూపములను తత్త్వజ్ణానియైనవాడే ఎఱుంగును.
|
05.06.2013
|
17
|
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् ।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥ |
అవినాశి తు తద్విద్ది యేన సర్వమిదం తతం I
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి II
|
నాశరహితమైన ఆ సత్యము( పరమాత్మ తత్త్వము) జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగుము. శాశ్వతమైనదానిని ఎవ్వరును నశింప జేయజాలరు.
|
06.06.2013
|
18
|
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः ।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥ |
అంతవంత ఇమే దేహా నిత్యసోక్తా: శరీరిణ:
ఆనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత II
|
ఈ శరీరములు అన్నియును నశించునవియే. కాని జీవాత్మ నాశరహితమ్య్, అప్రమేయము ( అనిర్వచనీయము). నిత్యము. కనుక (ఈవిషయమును ఎఱింగి) ఓ భరతవంశీ అర్జునా! నీవు యుద్దము చేయుము.
|
07.06.2013
|
19
|
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥ |
య ఏవం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం I
ఉభ్ త్ న విజానీయం హంతి న హన్యతే
|
ఆత్మ ఇతరులను చంపునని భావించు వాడును, అది (ఆత్మ) ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆఇద్దరు అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు. ఎవ్వరిచేతను చంపబడదు
|
08.06.2013
|
20
|
न जायते म्रियते वा कदाचि- न्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ |
న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వాభవితా వాన భూయ: I
అజో నిత్య: శాశ్వతో యం పురాణో హన్యతే హన్యమానే శరీరేII
|
ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు.పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు.
|
09.06.2013
|
21
|
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥
|
వేదానివినాశివం నిత్యం య ఏనమౌఅమవ్యయం I
కధం స పురుష: పార్ద కం ఘాతయతి హంతి కం II
|
ఓ పార్దా! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము, జననమరణములు లేనిదనియు, మార్పు లేనిదనియితెలిసి కొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును?
|
10.06.2013
|
22
|
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि ।
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ॥२- २२॥ |
వాసాంసి జీర్ణాని యధా విహయ నవాని గృహ్ణతి నరో పరాణి I
తధాశరీరాణి విహయ జీర్ణాన్యన్యాని సయాతి నవాని దేహీ I I
|
మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మపాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును.
|
11.06.2013
|
23
|
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः ।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२- २३॥ |
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక
న చైవం క్లేదయంత్యాపొ న శోషయతి మారుత:
|
ఈఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడపజాలదు. వాయువు ఆరిపొవునట్లు చేయజాలదు.
|
12.06.2013
|
24
|
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव च ।
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥२- २४॥ |
అచ్చేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ I
నిత్య: సర్వగత: స్ఠాణు: అ చలోయం సనాతన: II
|
ఈఅత్మ చేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపచేయుటకును సాద్యము కానిది. ఇది సత్యము, నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్ణాణువు (స్ధిరమైనది) సనాతనము ( శాశ్వతము)
|
13.06.2013
|
25
|
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते ।
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥२- २५॥ |
అవ్యక్తో యమచింత్యోయం అవికార్యోయముచ్యతే I
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి I I
|
ఈ ఆత్మ అవ్య్క్త క్త మైనది(ఇంద్రియ గోచరముగానిది) అచింత్యము ( మనస్సునకు అందనిది) వికారములేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకోనుము. కనుక అర్జునా! నీవు దీనికై శోకింపదగదు.
|
14.06.2013
|
26
|
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥ |
అధచైనం నిత్యజాతం నిత్యం నా మన్యసేమృతం I
తధాపి త్వం మహా బాహొ నైవం శోచితుమర్హసి I I
|
ఓ అర్జునా! ఈఆత్మకు జననమరణములు కలవని ఓకవేళ నీవు భావించి నప్పటికిని దీనికై నీవు శోకింపదగదు.
|
15.06.2013
|
27
|
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥ |
జాతస్య హి ధ్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్య చ I
తస్మాదపరిహార్యే ర్ఢే న త్వం శోచితుమర్హసి I I
|
పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించినవానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈవిషయములయందు నీవు శోకింపదగదు
|
16.06.2013
|
28
|
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥२- २८॥
|
అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత I
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కాపరిదేవనా I I
|
ఓ అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు గావు.( అవ్యక్తములు). మరణానంతరము గూడ అవి అవ్యక్తములే - ఈజననమరణములు మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు. ( ఇంద్రియ గోచరములు) అగుచుండును. ఇట్టి స్ఢితిలో వాటికై పరితపించుట నిష్ర్పయేజనము
|
17.06.2013
|
29
|
आश्चर्यवत्पश्यति कश्चिदेन- माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥२- २९॥ |
అశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవదతి తధ్తేవ చాన్య :
ఆశ్చర్య వచ్త్చెనమన్య: శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్
|
ఎవరోఒక మహాపురుషుడు మాత్రమే దీనిని (ఈ ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియెక మహాత్ముడు దీనినిగా చూచును. మరియెక మహాత్ముడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆవిన్నవారిలోకూడ కోందరు దీనిని గూర్చి ఏమియు ఎఱగరు.
|
18.06.2013
|
30
|
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत ।
तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥२- ३०॥ |
దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత I
తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితమర్హసి I I
|
ఓ అర్జునా! ప్రతిదేహమునందును ఉండెడి ఈ అత్మ వధించుటకు వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు
|
19.06.2013
|
31
|
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥२- ३१॥ |
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి I
ధర్మ్యాద్ది యుద్దాచ్ర్చేయో న్యత్ క్షత్రియస్య న విద్యతే I I
|
అంతేగాక స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్దమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్వము మఱియోకటి లేదు.
|
20.06.2013
|
32
|
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् ।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥२- ३२॥ |
యదృచ్చయా చోపపన్నం స్వర్జద్వారమపావృతం I
సుఖిన: పార్డ లభంతే యుద్దమిదృశం I I
|
ఓ పార్డా! యాదృచికముగా అనగా అనుకోకుండా తటస్డించిన ఇట్టి యుద్దము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెఱిచిన ద్వారము వంటిది.
|
21.06.2013
|
33
|
अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ।
ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥२- ३३॥ |
అధ చేత్త్వమిమం ధర్స్యం సంగ్రామం న కరిష్యసి I
తతస్స్య్ ధర్మం చ హిత్వా పాపమవాస్స్యసి I I
|
ఈ యుద్దము నీకు ధర్మబద్దము. ఒక వేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మమునుండి పాఱిపొయిన వాడవు అగుదువు. దానివలన కీర్తిని కోల్పోవుదువు.
|
22.06.2013
|
34
|
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् ।
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥२- ३४॥ |
అ కీర్తిం చాపి భూతాని కధ యిష్యంతి తేవ్యయాం I
సంభావితస్య చాకీర్తి: మరణాదతిరిచ్యతే I I
|
లోకులెల్లరును బహుకాలమువఱకును నీ అపకీర్తినిగూర్చి చిలువలు పలువలుగా చెప్పికొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణముకంటెను భాధాకరమైనది.
|
23.06.2013
|
35
|
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः ।
येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥२- ३५॥ |
భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారధా: I
యేషాంచత్వం బహుమతో భూత్వా యాస్యి లాఘవం I I
|
ఈమహారధులదృష్టిలో ఇప్పుడునీవు మిక్కిలి మాన్యుడవు. యుద్దవిముఖుడవైనచో వీరిదృష్టిలోనీవు చులకన అయ్యేదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్దమునుండి పారిపొయున్నట్టులు వీరు భావింతురు
|
24.06.2013
|
36
|
अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥२- ३६॥ |
అవాచ్యవాదంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితా: I
నిందంతస్తవ సామర్ద్యం తతోదు:ఖతరం ను కిం I I
|
నీ శత్రువులు నీ సామర్ద్యమును నిందించుచు నిన్నుగూర్చి పెక్కూఅనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును?
|
25.06.2013
|
37
|
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् ।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥२- ३७॥ |
హతో వా ప్రాస్స్యసి స్వర్గం జిత్వా నాభోక్షసే మహిం
తస్మాదుత్తిష్ట కౌతేయ యుద్దాయ కృతనిశ్చయ:
|
ఓ అర్జునా! రణరంగమున మరణించినచోనీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్దమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్దమునకు లెమ్ము.
|
....continued in 2nd part
our blog in english:http://srivijayaganapathi.blogspot.in/