Wednesday, May 29, 2013

శ్రీమద్భగవద్గీత-రెండవ అధ్యాయము- సాంఖ్యయెగము

శ్రీమద్భగవద్గీత

రెండవ అధ్యాయము- సాంఖ్యయెగము

Date
Verse
SANSKRIT
TELUGU
MEANING
29.05.2013
3
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप  I I

క్లైబ్యం మాస్మ గమ:   పార్ధ నైతత్త్యయుపపద్యతే I
క్షుద్రం హృదయదౌర్భల్యం త్వక్త్వోత్తిష్ట పరంతప II
కావున ఓ అర్జునా! పిరికితనమునకు లోనుకావద్దు. నీకిది ఉచితము కాదు. ఓ పరంతప! తుచ్చమైన ఈ హృదయదౌర్భల్యం ను వీడి, యుద్దమునకై నడుము బిగింపుము

30.05.2013
11
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे
गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः II
అశోచ్యానన్వశోచస్త్యం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశొచంతి పండితా:
ఓఅర్జునా! శోకింపదగని వారికొఱకు నీవు శోకించుచున్నావు. పైగా పండితునివలె మాట్లాడుతున్నావు. పండితులైనవారు ప్రాణములు పొయిన వారి గూర్చి గాని, ప్రాణములు పోని వారిని గుఱించి గాని శోకింపరు.
31.05.2013
12
त्वेवाहं जातु नासं त्वं नेमे जनाधिपाः
चैव भविष्यामः सर्वे वयमतः परम्


త్వేవాహం జాతు నాసం త్వం నేమే జనాదిపా:
చైవ భవిష్యామ: సర్వే యమత: పరం

నీవు గాని నేను గాని, ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడ మనము ఉండము అనుమాటయే లేదు ( అన్ని కాలములలోను మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలముల యందును ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు.)
01.06.2013
13
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा
तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र मुह्यति

దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనం జరా I
తధాదేహాంతరప్రాప్తి: ధీరస్తత్ర న ముహ్యతిII

జీవాత్మకు ఈదేహమునందు కౌమారము, యౌవనము, వార్దక్యమూ ఉన్నట్లై మఱియొక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈవిషయమున మెహితుడు కాడు.
02.06.2013
14
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः
आगमापायिनोऽनित्यास्तांस्तितिक्षस्व भारत

మాత్రాస్వర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదు:ఖదా: I
ఆగమాపాయనో నిత్యా: తాంస్తితిక్షస్వ భారత II

కౌంతేయ! విషయేంద్రియ సం యెగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీ లములు. అనిత్యములు. కనుక భారతా! వానిని సహింపుము
03.06.2013
15
यं हि व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥२- १५॥

యం హి వ్యధయంత్యే తే పురుషర్షభ I
సమదు:ఖసుఖం దీరంసోమృతత్యాయ కల్పతే II

పురుషశ్రేష్టా! ధీరుడైనవాడు సుఖ దు:ఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ              సంయేగములు  చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు.
04.06.2013
16
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः
उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्शिभिः

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత:I
ఉభయోరపి దృష్టొంత: త్ననయోస్తత్వద్శిభి:II

అసత్తు అనుదానికి (అనిత్యమైనదానికి) ఉనికియేలేదు. సత్తు అనుదానికి లేమి లేదు. ఈవిధముగా రెండింటికి వాస్తవరూపములను తత్త్వజ్ణానియైనవాడే ఎఱుంగును.
05.06.2013
17
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम्
विनाशमव्ययस्यास्य कश्चित्कर्तुमर्हति

అవినాశి తు తద్విద్ది యేన సర్వమిదం తతం I
వినాశమవ్యయస్యాస్య కశ్చిత్ కర్తుమర్హతి II

నాశరహితమైన సత్యము( పరమాత్మ తత్త్వము) జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగుము. శాశ్వతమైనదానిని ఎవ్వరును నశింప జేయజాలరు.
06.06.2013
18
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत

అంతవంత ఇమే దేహా నిత్యసోక్తా: శరీరిణ:
ఆనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత II

శరీరములు అన్నియును నశించునవియే. కాని జీవాత్మ నాశరహితమ్య్, అప్రమేయము           ( అనిర్వచనీయము). నిత్యము. కనుక (ఈవిషయమును ఎఱింగి) భరతవంశీ అర్జునా! నీవు యుద్దము చేయుము.
07.06.2013
19
एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्
उभौ तौ विजानीतो नायं हन्ति हन्यते

ఏవం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం I
ఉభ్ త్ విజానీయం హంతి హన్యతే

ఆత్మ ఇతరులను చంపునని భావించు వాడును, అది (ఆత్మ) ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆఇద్దరు అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు. ఎవ్వరిచేతను చంపబడదు
08.06.2013
20
जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा भूयः
अजो नित्यः शाश्वतोऽयं पुराणो हन्यते हन्यमाने शरीरे

  జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వాభవితా వాన భూయ: I
అజో నిత్య: శాశ్వతో యం పురాణో హన్యతే హన్యమానే శరీరేII

ఆత్మ కాలమునందును పుట్టదు, గిట్టదు.పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడినను ఇది చావదు.
09.06.2013
21
वेदाविनाशिनं नित्यं एनमजमव्ययम् कथं पुरुषः पार्थ कं घातयति हन्ति कम्

వేదానివినాశివం నిత్యం ఏనమౌఅమవ్యయం I
కధం పురుష: పార్ద కం ఘాతయతి హంతి కం II

పార్దా! ఆత్మ నాశరహితము, నిత్యము, జననమరణములు లేనిదనియు, మార్పు లేనిదనియితెలిసి కొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును?
10.06.2013
22
वासांसि जीर्णानि यथा विहाय     नवानि गृह्णाति नरोऽपराणि
तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ॥२- २२॥

వాసాంసి జీర్ణాని యధా విహయ నవాని గృహ్ణతి నరో పరాణి I
తధాశరీరాణి విహయ జీర్ణాన్యన్యాని సయాతి నవాని దేహీ  I I

మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి, నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మపాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును.
11.06.2013
23
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः
चैनं क्लेदयन्त्यापो शोषयति मारुतः ॥२- २३॥

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక
చైవం క్లేదయంత్యాపొ శోషయతి మారుత:

ఈఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడపజాలదు. వాయువు ఆరిపొవునట్లు చేయజాలదు.
12.06.2013
24
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्योऽशोष्य एव
नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥२- २४॥

అచ్చేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ I
నిత్య: సర్వగత: స్ఠాణు: చలోయం సనాతన: II

ఈఅత్మ చేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపచేయుటకును సాద్యము కానిది. ఇది సత్యము, నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్ణాణువు (స్ధిరమైనది) సనాతనము ( శాశ్వతము)
13.06.2013
25
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्योऽयमुच्यते
तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि ॥२- २५॥

అవ్యక్తో యమచింత్యోయం అవికార్యోయముచ్యతే I  
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి I I

ఆత్మ అవ్య్క్త క్త మైనది(ఇంద్రియ గోచరముగానిది) అచింత్యము ( మనస్సునకు అందనిది) వికారములేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకోనుము. కనుక అర్జునా! నీవు దీనికై శోకింపదగదు.
14.06.2013
26
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम्
तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि

అధచైనం నిత్యజాతం నిత్యం నా మన్యసేమృతం I
తధాపి త్వం మహా బాహొ నైవం శోచితుమర్హసి I I

అర్జునా! ఈఆత్మకు జననమరణములు కలవని ఓకవేళ నీవు భావించి నప్పటికిని దీనికై నీవు శోకింపదగదు.

15.06.2013
27
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य
तस्मादपरिहार्येऽर्थे त्वं शोचितुमर्हसि

జాతస్య హి ధ్రువో మృత్యు: ధ్రువం జన్మ మృతస్య చ I
తస్మాదపరిహార్యే ర్ఢే త్వం శోచితుమర్హసి I I

పుట్టిన వానికి మరణము తప్పదు. మరణించినవానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈవిషయములయందు నీవు శోకింపదగదు

16.06.2013
28
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥२- २८॥

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత I
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కాపరిదేవనా I I

అర్జునా! ప్రాణులన్నియును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు గావు.( అవ్యక్తములు). మరణానంతరము గూడ అవి అవ్యక్తములే - ఈజననమరణములు మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు. ( ఇంద్రియ గోచరములు) అగుచుండును. ఇట్టి స్ఢితిలో వాటికై పరితపించుట నిష్ర్పయేజనము
17.06.2013
29
आश्चर्यवत्पश्यति कश्चिदेन- माश्चर्यवद्वदति तथैव चान्यः
आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद चैव कश्चित् ॥२- २९॥

అశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవదతి తధ్తేవ చాన్య :
ఆశ్చర్య వచ్త్చెనమన్య: శృణోతి శ్రుత్వాప్యేనం వేద చైవ కశ్చిత్

ఎవరోఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ( ఆత్మను) ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియెక మహాత్ముడు దీనినిగా చూచును. మరియెక మహాత్ముడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆవిన్నవారిలోకూడ కోందరు దీనిని గూర్చి ఏమియు ఎఱగరు.

18.06.2013
30
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत
तस्मात्सर्वाणि भूतानि त्वं शोचितुमर्हसि ॥२- ३०॥

దేహీ నిత్యమవధ్యోయం  దేహే సర్వస్య భారత I
తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితమర్హసి I I

అర్జునా! ప్రతిదేహమునందును ఉండెడి అత్మ వధించుటకు వీలుకానిది. కనుక ప్రాణిని గూర్చియైనను నీవు శోకింపదగదు
19.06.2013
31
स्वधर्ममपि चावेक्ष्य विकम्पितुमर्हसि
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य विद्यते ॥२- ३१॥

స్వధర్మమపి చావేక్ష్య వికంపితుమర్హసి I  
ధర్మ్యాద్ది యుద్దాచ్ర్చేయో న్యత్ క్షత్రియస్య విద్యతే I I

అంతేగాక స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్దమునకు మించినట్టి శ్రేయస్కరమైన కర్తవ్వము మఱియోకటి లేదు.

20.06.2013
32
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥२- ३२॥

యదృచ్చయా చోపపన్నం స్వర్జద్వారమపావృతం I
సుఖిన: పార్డ లభంతే యుద్దమిదృశం I I

పార్డా! యాదృచికముగా అనగా అనుకోకుండా తటస్డించిన ఇట్టి యుద్దము  అదృష్టవంతులైన  క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెఱిచిన ద్వారము వంటిది.

21.06.2013
33
अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं करिष्यसि
ततः स्वधर्मं कीर्तिं हित्वा पापमवाप्स्यसि ॥२- ३३॥

అధ చేత్త్వమిమం ధర్స్యం సంగ్రామం కరిష్యసి I
తతస్స్య్ ధర్మం హిత్వా పాపమవాస్స్యసి I I

యుద్దము నీకు ధర్మబద్దము. ఒక వేళ నీవు దీనిని  ఆచరింపకున్నచో నీ స్వధర్మమునుండి పాఱిపొయిన వాడవు అగుదువు. దానివలన కీర్తిని కోల్పోవుదువు.
22.06.2013
34
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम्
सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥२- ३४॥

కీర్తిం చాపి భూతాని కధ యిష్యంతి తేవ్యయాం I
సంభావితస్య చాకీర్తి: మరణాదతిరిచ్యతే I I

లోకులెల్లరును బహుకాలమువఱకును నీ అపకీర్తినిగూర్చి చిలువలు పలువలుగా చెప్పికొందురు. మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణముకంటెను భాధాకరమైనది.

23.06.2013
35
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः
येषां त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥२- ३५॥

భయాద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారధా: I
యేషాంచత్వం బహుమతో భూత్వా యాస్యి లాఘవం I I

ఈమహారధులదృష్టిలో ఇప్పుడునీవు మిక్కిలి మాన్యుడవు. యుద్దవిముఖుడవైనచో వీరిదృష్టిలోనీవు చులకన అయ్యేదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్దమునుండి పారిపొయున్నట్టులు వీరు భావింతురు

24.06.2013
36
अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥२- ३६॥

అవాచ్యవాదంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితా: I
నిందంతస్తవ సామర్ద్యం తతోదు:ఖతరం ను కిం I I

నీ శత్రువులు నీ సామర్ద్యమును నిందించుచు నిన్నుగూర్చి పెక్కూఅనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును?

25.06.2013
37
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥२- ३७॥

హతో వా ప్రాస్స్యసి స్వర్గం జిత్వా నాభోక్షసే మహిం
తస్మాదుత్తిష్ట కౌతేయ  యుద్దాయ కృతనిశ్చయ:

అర్జునా! రణరంగమున మరణించినచోనీకు వీరస్వర్గము ప్రాప్తించును. యుద్దమున జయించినచో రాజ్యభోగములను అనుభవింపగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్దమునకు లెమ్ము.



....continued in 2nd part

our blog in english:http://srivijayaganapathi.blogspot.in/
our email address: srivijayaganapathidevalayam@gmail.com

No comments:

Post a Comment