Wednesday, May 15, 2013

శ్రీ విఘ్నేశ్వర భక్తి సుమాలు

శ్రీ  విఘ్నేశ్వర భక్తి సుమాలు
A blog of:
SRI VIJAYAGANAPATHI DEVALAYAM
SSVDA LAYOUT, EK MARG, SIMHACHALAM-SONTYAM ROAD
SOWBHAGAYARAYAPURAM, VISAKHAPATNAM

శ్రీ విజయ గణపతి
ప్రధమ సంచిక (ప్రారంభ సంచిక)

శ్రీ విజయ నామ సంవత్సరం- వైశాఖం- ఉత్తరాయణం-వసంతఋతువు- శుద్దపంచమి-  బుధవారం- శ్రీశంకర భగవత్పాద జయంతి - 15.05.2013




गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुरेव परंब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥



శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం
భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి
శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి
,సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,యంతన్నయోధ్యాపురిన్జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః
   

अम्बितमे नदीतमे देवितमे सरस्वति।

अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि॥



Ambitame, naditame, devitame, Sarasvati
Aprasasta iva smasi prasastim Amba naskriti. (Rigveda . 2. 41. 16)
 


Meaning: O Sarasvati, you the best of mothers, the best of rivers, the best of gods ! Although we are of no repute, mother, grant us distinction




Sri Vijayaganapathi






. ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసూతా హృదయానురాగ సం
   పాదికి దోషభేదికి( బ్రసన్న వినోదికి విఘ్నవల్లికా
   చ్చేదికి మంజువాదికి నశేష జగజ్జన్ నంద వేదికిన్
   మోదకఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్
అర్ధము:

హిమాచల కుమారి అయిన ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి,  కలికల్మషాలనుభేదించి, ఆపన్నుల విన్నపాలను ఆమోదించి, ఆశ్రితుల విఘ్నలతలను ఛేదించి, మంజుల మధురభాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించి,నివేదించిన కుడుములు ఉండ్రాళ్ళూ కడుపునిండా ఆరగించి మూషకరాజును ఆధిరోహించి, ముల్లోకాలకూమోదప్రదాయకుడైన వినాయకునకు కైమోడ్పులు ఘటిస్తాను.

శ్రీ  విఘ్నేశ్వర నామాలు



(గోవిందనామాలు లాగ అంటే  - శ్రీనివాసా గోవింద- శ్రీ వెంకటేశ గోవింద .... ఆ పద్దతిలొ చదువుకోవాలి)
1.       విశ్వరక్షక వినాయక - విజయ ప్రదాత వినాయక
విద్యాదాయక వినాయక -విమల చరిత్ర వినాయక       వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక //
2.       జయకర శుభకర వినాయక - జగదీశ్వరాయ వినాయక
జ్యేష్టరాజాయ వినాయక -జ్ఞానప్రదాత వినాయక          వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
3.       గజముఖ వదన వినాయక - గౌరిప్రియ సుత వినాయక
గజాననా వినాయక -గణపతి దేవ వినాయక             వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
4.       ప్రసన్నవదన వినాయక- పరమేశ్వరసుత వినాయక
పాశాంకుశధర వినాయక - పావనమూర్తి వినాయక      వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
5.       మూషకవాహన వినాయక - మోదకప్రియుడ వినాయక
మోక్షప్రదాయక వినాయక- మంగళమూర్తి వినాయక   వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
6.       సంకటహరణవినాయక - స్కంధపూర్వజ వినాయక
సత్యసంకల్ప వినాయక -సర్వజనప్రియ వినాయక    వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
7.       సిద్దిబుద్దిప్రదవినాయక - సర్వజ్ఞా వినాయక
సకల సద్గుణ వినాయక - సర్వేశ్వరుడ వినాయక   వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
8.       ఏకదంతాయ వినాయక - ఏకవీరాయ వినాయక
ఏకాక్షర పరాయ వినాయక - ఏకేశ్వరుడా వినాయక  వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
9.       వక్రతుండాయ వినాయక - వహ్నివదనాయ వినాయక
వేదాంతగోచరాయ వినాయక - వరదహస్తాయ వినాయక   వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
10.   శూర్పకర్ణాయ  వినాయక  - సుందరరూప వినాయక
సముద్రమధనాయ వినాయక - సంసారవైద్యాయ వినాయక  వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
11.   లంబోదరాయ వినాయక - లడ్డుకప్రియాయ వినాయక
లక్ష్యధారాయ వినాయక - లాస్యప్రియాయ వినాయక       వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
12.   హేరంబాయ వినాయక - హృదయనివాస వినాయక
హవ్యవాహన వినాయక - హస్తిరూపుడ వినాయక     వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
13.   నాగయజ్ఞోపవీత వినాయక - నాదలయానంద వినాయక
నామపారాయణ ప్రీత వినాయక - నాయకోత్తమ వినాయక  వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
14.   చతుర్భుజాయ వినాయక - చతుర్ముఖాయ వినాయక
చరాచరాత్మక వినాయక - చండవిక్రమ వినాయక         వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
15.   ఓంకారరూపాయ వినాయక - ఓంకార ప్రియుడ వినాయక
ఓషధీపతయే వినాయక - ఔన్నత్యవిగ్రహాయ వినాయక  వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
16.   పత్రిపూజప్రియ వినాయక - మధురఫలప్రియ వినాయక
పుష్పాలంకృత వినాయక - పుణ్యఫలప్రద వినాయక    వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
17.   ఆదిపూజ్యాయ వినాయక - ఆద్యంతరహిత వినాయక
అఖిలాండనాయక వినాయక - అంతర్యామివి వినాయక  వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
18.   ఆధారపీఠాయ వినాయక - అజరామరాయ వినాయక
అక్షయాయ వినాయక - అమోఘసిద్ధయే వినాయక   వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక //
19.   ధర్మరక్షక వినాయక - దైత్యనాశన వినాయక
ధనధాన్యసమన్విత వినాయక - ధరణీధరాయ వినాయక  వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
20.   భయాపహారాయ వినాయక - భోగదాతాయ వినాయక
భక్తి సులభాయ వినాయక - బ్రహ్మాండరూప వినాయక     వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
21.   నిత్యానందాయ వినాయక - నిత్యపూజ్యాయ వినాయక
   నిత్యానుగ్రహ వినాయక - నిత్యరక్షక వినాయక                   వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
22.   మహావీరాయ వినాయక - మహారూపాయ వినాయక
మహా బలాయ వినాయక - మహాబుద్దయే వినాయక    వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
23.   సర్వరోగహర వినాయక - సర్వదుఖ:హరవినాయక
సర్వతాపహర వినాయక - సర్వరక్షక వినాయక    వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
24.   సిందూర వదనాయ వినాయక - సిం హాసనాభూష్యాయ వినాయక
శివానందవివర్జిత వినాయక - శివప్రియాయ వినాయక         వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
25.   సౌభాగ్యదాయ వినాయక - సదాశాంతాయ వినాయక
సాంద్రకరుణాయ వినాయక - శుభంకరాయ వినాయక   వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
26.   కారుణ్యమూర్తి వినాయక - కమనీయరూప వినాయక
కళ్యాణగుణధామ వినాయక - కలుషవిదూర వినాయక   వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//
27.    కోటిసూర్య సమప్రభ వినాయక - కోటియజ్ఞఫలప్రద వినాయక
కృపాకటాక్షసిందు వినాయక - కైవల్యరూప వినాయక    వినాయక నమొ వినాయక - విఘ్ననివారణ వినాయక//

About Our Temple:
Sri Vijayaganapathi devalayam is located about five kilometers from the famous Sri Varaha Narasimhaswamy temple (down hill) in Simhachalam on the Simhachalam -Sontyam- Vizianagaram road in the EK Marg of SSVDA Lay out.  It is about 10kms from Visakhapatnam Airport and 15 Kms from the Visakhapatnam Railway station.
  It was located in a picturesque location of beautiful gardens surrounded by hills giving an impression of a valley. The temple was connected by a good motor able road.  
The temple was inaugurated on 25th March 2000. The Deity in the temple - Sri Vijayaganapathi is 3 feet in height made of black single stone of famous Peddapuram Hills in East Godavari District of Andhra Pradesh.  
The temple celebrates several pujas and festivals with reverence throughout the year. Sri Vinayaka Chavithi festival will be performed on a large scale for about 21 days with Annadanam to the devotees and poor people on the last day of the festival. Several Yagams like the Sri Vijaya Ganapathi Sahitha Satachandi yagam was performed for the universal peace in this temple apart from Sri Lakshmi Ganapathi Homams frequently. 
The temple has a publication trust to print several books. It published several books so far - They are “Sri Ganapathi Pradhana Slokamulu", "Sri Ganesh Stotramulu", "Shodasa Ganapathi Dynamulu" and "Sri Narayana Kavacham" from the great poet Pothana Bhagavatam etc. It also publishes a monthly magazine " Sri Vigneshwara Bakthi Sumalu". The Magazine was inaugurated by H H Sri Vidya Nrusimha Bharathi Shankaracharya of Pushpagiri Peetam during the month of May 2006. As the cost of publication has gone up leaps and bounds, we are in touch with our devotees through email-  srivijayaganapathidevalayam@gmail.com.   Through this mail we are sending many informative articles with the Title – “OUR HERITAGE”  in English and “MANA SAMPADA”  in Telugu.  These will be sent to all the Devotees who contact us to the above email address.

Dear Devotees,

This blog is made known to all about  our temple, which I have constructed in a humble way in the service of Lord Sri Vijayaganapathi. The devotees to the lord may please give their suggestions and feedback so as to develop the blog and helpful to them. Articles of interest may be sent to us so as to publish the same in this blog. The articles section in the blog will be updated on every suddha chavthi in every month. Please do not post abusive comments in this blog. This is  blog  intended as a service to the Lord Sri Vijayaganapathi only.

Yours Faithfully

(V.Vijayasaradhi)
Managing Trustee.


 శ్రీ విజయ గణపతి అభిషేకము :





 

No comments:

Post a Comment