మూడవ అధ్యాయము - కర్మయోగము
లోకేస్మిన్ ద్వివిధా నిష్దా పురాప్రోక్తా మయానఘ
జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినామ్ ( 3-3)
ఓ అర్జున! ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకుముందే చెప్పివుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగముద్వారా, యోగులకు కర్మయోగముద్వారాను నిష్ట కలుగును.
యజ్ఞములద్వారా సంతృప్తినిపోందిన దేవతలు మీకు ( మానవులకు) ఆయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈవిధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే.
ఓ అర్జునా! ఇట్లు పరంపరాగతముగా కోనసాచున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్వములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వానియొక్క జీవితము వ్యర్ధము.
యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ:
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయో:
ప్రకృతిగుణములచే పూర్తిగామోతులైన మనుష్యులు ఆ గుణములయందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడిజ్ణానముగల మందబుద్దులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని యైన వాడు భ్రమకు (ఊగిసలాటకు) గురిచేయరాదు.
న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సన్న్యసనాదేవ సిద్దిం సమధిగచ్ఛతి (3-4)
మనుష్యుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టాసిద్ది అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్దిని అనగా సాంఖ్యనిష్టను అతడు పోందజాలడు.
న హి కశ్చిత్ ష్ణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ I
కార్యతే ఆహ్యవశ: కర్మ సర్వ: ప్రకృతిజైర్గుణై:
(3-5)
ఏ మనుష్యుడైనను ఏకాలమందీనను క్షణమాత్రముకూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు.ఏలనన మనుష్యులందఱును ప్రకృతిజనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతివ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును.
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ I
ఇంద్రి యార్ధాన్ విమూఢాత్మా మిధ్యాచార: స ఉచ్చతే I
I (3-6)
బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియవ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియవిషయములను చింతించునట్టి మూఢూని మిధ్యాచారిగా అనగా దంభి అనియందురు.
కాని, ఆర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపఱుచుకొని, ఆనాసక్తుడై ఇంద్రియములద్వారా కర్మయోగచరణమును కావించు పురుషుడు శ్రేష్టుడు.
యస్త్యింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున I
కర్మేంద్రియై: కర్మయెగమ్ అసక్త: స విశిష్యతే I
I (3-7)
నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్యకర్మణ:
శరీరయాత్రాసి చ తే న ప్రసిద్ద్యేదకర్మణ:
(3-8)
నీవు శాస్ర్తవిహిత కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలనుచేయకుండుటకంటెను చేయుటయే ఉత్తమము.కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణముగూడ సాధ్యముగాదు.
యజ్ణార్ధాత్ కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధన:
తదర్ధం కర్మ కౌంతేయ ముక్తసంగ: సమాచర (3-9)
ఓ అర్జునా! యజ్ఞార్ధము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలొ చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ణార్ధ మే కర్తవ్వకర్మలను చక్కగా అచరింపుము.
సహయజ్ఞా: ప్రజా: సృష్ట్యాపురోవాచ ప్రజాపతి:
అనేన ప్రసవిష్యధ్వమ్ ఏష నోస్త్విష్టకామధుక్ (3-10)
కల్పది యందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగ ప్రజలను సృష్టించి, "మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్దిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలే కోరిన కోర్కెలనెల్ల తీర్చును". అని పల్కెను.
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వ:
పరస్పరం భావయంత: శ్రేయ: పరమవాప్స్యధ: (3-11)
"ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరుఛుడు. మఱియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్సార్ధభావముతో మీరు పరస్పరము సంతృప్తిపఱుచుకొనుచు పరమశ్రేయస్సును పోందగలరు" అని పల్కెకెను.
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితా:
తైర్దత్తనప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ స: (3-12)
యజ్ఞశిష్టాశిన: సంతో ముచ్యంతే సర్వకిల్బిష్తె:
భుజంతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ : (3-13)
యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్టపురుషులు అన్ని పాపములనుండి ముక్తుయ్యేదరు. తన శరీర పోషణకే ఆహరమును సిద్దపఱుచుకొను పాపులు పాపమునే భుజింతురు.
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవ:
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మసముద్భవ: (3-14)
కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షరసముద్భవమ్
తస్మాత్ సర్వగతం బ్రహ్మనిత్యం యజ్ఞే ప్రతిష్టితమ్ (3-15)
ప్రాణములన్నియు అన్నము (ఆహారము) నుండి జనింఛును. అన్నోత్పత్తి వర్షమువలన ఏర్పడును. యజ్ణమువలన వర్షములు కురియును. విహితకర్మలు యజ్ణములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మనుండి ఉద్భవించినవని తెలుసుకోనుము. అందువలన సర్వవ్యాపియు, అవ్యయుడను ఐన పరమాత్మసర్వదా యజ్ఞములయందే ప్రతిష్టితుడైవున్నాడు.
ఏవం ప్రవర్తితం చక్రం నామవర్తయతీహ య:
అఘాయురింద్రియారామో మోఘం పార్ధ స జీవతి (3-16)
యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ:
ఆత్మన్యేవచ సంతుష్ట: తస్యకార్యం న విద్యతే (3-17)
సచ్చిదానందఘనపరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానియైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమింఛును. అతడు పూర్ణకాముడు. కనుక ఆత్మయందే తృప్తినోందును. అతడు ఆత్మయందే నిత్యసంతుష్టుడు. అట్టి వానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు.
నైన తస్య కృతేనార్ధో నాకృతేనేహ కశ్చన
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయ: ( 3-18)
అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలనను, చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయేజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్దపరమైన సంబంధము ఏవిధముగను ఉండదు.
తస్మాదసక్త: సతతం కార్యం కర్మ సమాచర
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరష: (3-19)
అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము.ఏలనన ఆసక్తివీడి కర్మలను ఆచరించు మనుష్యునకు పరమాత్మప్రాప్తి కలుగును.
కర్మణైవ హి సంసిద్దిమ్ ఆస్ధితా జనకాదయ:
లోకసంగ్రహమేవాసి సంసశ్యన్ కర్తుమర్హసి (3-20)
జనకుడు మొదలగు జ్ణానులుగూడ ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్దిని పోందిరి. కావున నీవును లోకహితార్ధ మై కర్మలను ఆచరించుటయే సముచితము.
యద్యదాచరతి శ్రేష్ట: తత్తదేవేతరో జన:
స యత్ర్పమాణం కురుతే లోకస్తదనువర్తతే (3-21)
శ్రేష్టుడైన పురుషుని ఆచరణమునే ఇతరులును అనుసరింతురు. అతడు నిల్పిపిన ప్రమాణమునే లోకులందరును పాటించెదరు.
నమే పార్ధాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి (3-22)
ఓ అర్జునా! ఈముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదియేలేదు. అట్లే పోందదగిన వస్తువులలో ఏదియును నేను పోందనిదియును లేదు. ఐనను నేను కర్మలయందే ప్రవర్తిల్లు చున్నాను.
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత:
మమ వర్త్మాను వర్తంతే మనుష్యా: పార్ద సర్వశ: (3-23)
ఓ పార్దా! ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింప కున్నచో లోకమునకు గొప్పహాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరును అన్నివిధముల నా మార్గమునే అనుసరింతురు.
ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహమ్
సంకరస్య చ కర్తా స్యామ్ ఉపహన్యామిమా: ప్రజా:
నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నియును నశించును. అంతేగాదు, లోకములయందు అల్లకల్లోములు (సాంకర్యములు) చెలరేగును. ప్రజానష్టము వాట్టిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యెదను.
సక్తా: కర్మణ్యవిద్వాంసో యధాకుర్వంతి భారత
కుర్యాద్విద్వాంస్తధాసక్త: చికీర్షుర్లోకసంగ్రహమ్
ఓ భారతా! (అర్జునా)! అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించునట్లుగావిద్వాంసుడు (జ్ఞాని) కూడాలోకహితార్ధమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను.
న బుద్ధిభేధం జనయేదజ్ఞానం కర్మసంగినామ్
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త: సమాచరన్
(3-26)
పరమాత్మస్వరూపమునందు నిశ్చల్సస్దితిని పోందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో (ఫలాసక్తితో) ఆచరించు అజ్ఞానులబుద్ధులను భ్రమకులోనుచేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్దను కలిగింపరాదు. పైగా తానుకూడా శాస్ర్తవిహితములైన సమస్తకర్మలను చక్కగాచేయుచు వారితోకూడా అట్లే చేయించవలెను.
ప్రకృతే: క్రియమాణాని గుణై: కర్మాణి సర్వశ:
అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే (3-27)
వాస్తముగా కర్మలన్నియును అన్నివిధముల్ ప్రకృతిగుణములద్వారానే చేయబడుఛుండును. అహంకార విమూఢాత్ముడు (అహంకారముచే మోహితమైన అంతకరణముగల అజ్ఞాని) "ఈ కర్మలకు నేనేకర్తను" అని భావించును.
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయో:
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే (3-28)
ఓ మహాబాహు! అర్జునా గుణవిభాగతత్త్వమును, కర్మవిభాగ తత్త్వమును తెలుసికొన్నజ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచ్చున్నవని భావించి, వాటియందు ఆసక్తుడుకాడు.
పకృతేర్గుణసమ్మూఢా: సజ్జంతే గుణకర్మసు
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్నవిచాలయత్
(3-29)
మయి సర్వాణి కర్మాణి సస్న్యస్యాద్య్హాత్మచేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వర: ( 3-30)
అంతర్యామిని, పరమాత్మనుఐన నాయందే నీ చిత్త్మునుఉంచి , కర్మలన్నటిని నాకే అర్పించి, ఆశా మమతా సంతాపములను వీడి, యుద్దము చేయుము.
యే మే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవా:
శ్రద్దానంతో నసూయంతో ముచ్యంతేపి కర్మభి: (3-31)
దోషదృష్టిలేకుండా శ్రద్దాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మ బందముల నుండి ముక్తులయ్యెదరు.
యే త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతమ్
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ నిద్ది నష్టాన చేతస: (3-32)
కాని నాయందు దోషారోపణ ఛేయుచు, నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములయందును మోహితులై భ్రష్టులై, కష్టనష్టములు పాలయ్యేదరని ఎఱుంగుము.
అధ చేత్త్యమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తతస్స్వధర్మం కీర్తీంచ హిత్వా పాపమవాప్సుసి (3-33)
ఈ యుద్దము నీకు ధర్మబద్దము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పాఱిపోయిన వాడవు అగుదువు.దాని వలన కీర్తిని కోల్పోవుదువు. పైగా నీవు పాపము చేసిన వాడవగుదువు.
ఇంద్రియస్యేంద్రియస్యాదదర్ధే రాగద్వేషౌ వ్వవస్ధితౌ
తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్ధినౌ (3-34)
ప్రతిఇంద్రియార్ధమునందు రాగద్వేషములు దాగియున్నవి.మనుష్యుడు ఈ రెండింటికిని వశము కాకూడదు. ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు.
శ్రేయాన్ స్వధర్మోనిగుణ: పరధర్మాత్ స్వసుష్టితాత్
స్వధర్మేనిధనం శ్రేయ: పరధర్మో భయావహ: (3-35)
పరధర్మమునందు ఎన్నోసుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగణ్ములు లేకున్నను చక్కగా అనుష్టింపబడు ఆ పరధర్మముకంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయ శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము.
కామ ఎష క్రోధ ఏష రజోగుణ సముద్భవ:
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణం (3-37)
రజోగుణములనుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపమును దాల్చును. ఇది మహాశనము. భోగానుభవములతో ఇది చల్లరునది గాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషమున దీనిని పరమశత్రువుగా ఎఱుంగుము.
పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడునట్లు, జ్ఞానము కామముచే అవృతమైవుండును.
ధూమేనావ్రియతే వహ్ని: యధాదర్శో మలేనచ
యధోల్బేనానృతో గర్భ: తధా తేనేదమావృతమ్ (3-38)
ఆవృతం జ్ఞానమేతేన గజ్ఞానినో నిత్యవైరిణా
కామరూపేణ కౌంతేయ దుష్ఫూరేణానలేన చ (3-39)
ఓ అర్జునా! కామము అగ్నితో సమానమైనది(అగ్నివంటిది) అది ఎన్నటికిని చల్లారదు. జ్ఞానులకు అది నిత్యవైరి మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును.
ఇంద్రియములు, మనస్సు, బుద్ది ఈ కామమునకు నివాసస్దానములు ఈ కామము మనోబుద్దీంద్రియములు ద్వారాజ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మోహితునిగా చేయును.
ఇంద్రియాణి మనో బుద్దిరస్యాధిష్టానముచ్చతే
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్
(3-40)
తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌనియమ్యభరతర్షభ
పాప్మానం ప్రజహి హేన్యం జ్ఞానవిజ్ఞాననాశనమ్ (3-41)
కావున ఓ అర్జునా! మొదట ఇంద్రియములను వశపఱుచుకొనుము.పిదప జ్ఞానవిజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపియైన ఈ కామమును ఆవశ్యముగా సర్వశక్తులువడ్డి రూపుమాపుము.
ఇంద్రియాణి పరాణ్యాహు: ఇంద్రియభ్య: పరం మన:
మనసస్తు పరా బుద్ది: యో బుద్దే: పరతస్తు స: ( 3-42)
స్ధూలశరీరముకంటెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు అని పేర్కోందురు. ఇంద్రియములకంటెను మనస్సు, దానికంటెను బుద్ది శ్రేష్టమైనవి. ఆబుద్దికంటెను అత్యంత శ్రేష్టమైనది , సూక్షమైనది ఆత్మ.
ఏవం బుద్దే: పరం బుద్ద్వా సంస్తభ్యాత్మానమాత్మనా
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ (3-43)
ఈ విధముగా బుద్దికంటెను ఆత్మపరమైనదని అనగా సూక్షము, బలీయము, మిక్కిలి శ్రేష్టము ఐనదని తెలుసుకోని, ఓ మహాబాహూ! బుద్దిద్ద్వారా మనస్సును వశపఱుఛుకొని, దుర్జయశత్రువైన కామమును నిర్మూలింపుము.
ఓం తత్సదితి శ్రీమద్బగవద్జీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయం యేగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయేగో నామ తృతీయేధ్యాయ:
No comments:
Post a Comment