Thursday, July 11, 2013

శ్రీ విఘ్నేశ్వర భక్తి సుమాలు-తృతియ సంచిక


శ్రీ  విఘ్నేశ్వర భక్తి సుమాలు
స్వస్ది శ్రీ విజయ నామ సంవత్సరము


ఆషాడమాసం శుద్ద చవితి

తృతియ సంచిక

ప్రార్ధనాశ్లోకము.

శ్లోలంబోదరం పరమసుందరమేకదంతం
     రక్తాంబరం త్రిణయనం పరమం పవిత్రమ్
     ఉద్యద్ దవాకర నిభ్వోజ్జ్వలకాంతికాంతం

     విజఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి
ప్రాత:స్మరణం

శ్రీ గణేశ స్మరణము
 ప్రాత: స్మరామి గణనాధమనాధబంధుం
సిందూరపూర పరిశోభిత గండయుగ్మమ్
ఉద్దండ విఘ్నపరిఖండన చండదండ -
మాఖండలాది సురనాయక బృందవంద్యమ్
మాసంలొ ముఖ్యపండగలు.
13-శనివారం - స్కంద పంచమి.

14- ఆదివారం - కూమారషష్టి

18- గురువారం - మహాలక్ష్మివ్రతారంభం- రోజున ఇల్లంతా శుభ్రపరఛి ముగ్గులతో అలంకరించి, గుమ్మానికి పసుపు కుంకుమలు, మామిడి ఆకులతోరణాలతో అలంకరణ చేయాలి. కలశమందు లక్ష్మిదేవిని  ఆవాహన చేసి పూజించాలి.

19- శుక్రవారం - తొలి ఏకాదశి- విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.

22- సోమవారం - వ్యాసపూర్ణిమ ( గురు పూజ)
25- గురువారం - సంకష్టహరచతుర్ది.

 స్వగణములకు నాయకుడు-వినాయకుడు
గణపతి యొక్క వికాసాన్ని ప్రధానంగా మనం మూడు దశలో గమనించివచ్చు .ఋగ్వేద కాలంలో వినవచ్చే 'గణపతి 'అన్న పేరు 'బ్రాహ్మణస్పతి 'అన్న పేరు ఒకటిగానే వుంది .రెండవది ఐతిహాసిక,స్మృతులు కాలంనాటి విఘ్నకారియైన'వినాయకుడు'క్రూరదేవత .మూడవది ,చివరిదీ అయిన గౌరీ పుత్రుడు,గజముఖుడు అయిన గణపతి.ఋగ్వేదంలో గణపతి పేరున్న మంత్రాలు ఒకటి రెండు వున్నవి . వాటిలో ఎక్కువ వ్యాప్తిలో వున్నట్టి గణపతి పూజాకాలంలో చెప్పబడే మంత్రం .
''గణనాం త్వా గణపతిం హవామహే కవీం కవీనాముపవశ్ర వస్తమం |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అన:శృణ్వన్నూతిభి :సీద సాదనం ''

మంత్రానికి సాయణుల వ్యాఖ్య : బ్రహ్మణస్పతీ,ప్రవ్రుద్దమగు కర్మలకు ప్రభువైనట్టి వాడవూ ,దేవగణములకు చెందినవాడవూ, స్వగణములకు నాయకుడవూ ,క్రాంతదర్సులైన కవులలో శ్రేష్టడవు ,అపరిమితమైన ఆహారము కలవాడవూ,ప్రముఖులమధ్య ప్రకాశించువాడవూ,మంత్రాధిదేవతవూ అయిన నిన్ను యీ కర్మ నిమితముగా ఆహ్వానిస్తున్నాను. మా నుతులను వింటూ నీ రక్షణలతో యజ్ఞగృహమునకు వచ్చి కూర్చుండుము.'  యాస్కుడు మంత్రంలోని బ్రహ్మణస్పతి అను పదానికి అన్నం మరియూ ధనములకు అధిపతీ అని నిర్వచించినాడు.ఋగ్వేదంలో గణపతి గణ పదములు గల మరొక మంత్రం :

''నిషుసీద గణపతే గణేషుత్వా మాహు ర్విప్రతమం కవినాం నఋతే
త్వత్ క్రియతే కించనారే మహామర్కం మఘవం జ్చిత్ర మర్చ''


మరద్గుణాలకు ప్రభువైన ఇంద్ర |నీ స్తుతికర్తల మధ్య శ్రేష్ఠమగు విధముగా అసీనుడవు కమ్ము .మేధావులైన ప్రాజ్ఞు లలోనీవు అధిక ప్రజ్ఞవంతుడవని విజ్ఞులు అంటున్నారు .నిన్ను వదలి సమిపములోగాని,దూరమునగాని ఎట్టి కర్మయూ నెరవేరదు .ధనవంతుడైన ఇంద్రా | మహాత్స్వరూపము గల పూజనీయమైన మస్తోమమును ,నానా రూపముల గౌరవించుము-అన్నది పైన పేర్కొన్న మంత్రం పై సాయణుల భాష్యానికి భావార్ధం . రెండు మంత్రాలే కాక 'గణేన'అను పదం మాత్రమే గల మంత్రంమొకటి వున్నది .ఇచ్చట 'గణ' దాన్ని ఆంగీరసగణా|అనగా సంగీతజ్ఞలు అని నిర్వచించినారు . ఇదివరకే పేర్కొన్న మంత్రంలోని 'గణేషు 'అను శబ్ధములోగల 'గణ 'పదానికి 'స్తుతికర్తలు 'అనీ అర్ధం .
జిల్లేడుపై వెలసిన గణపతి

సామాన్యంగా దేవాలయాల్లో ఉండే దేవతా విగ్రహాలు శిల్పులు చెక్కినవి కాగా అరుదుగా కొన్ని స్వయంగా వెలసినవి ఉంటాయి. అలాంటి స్వయంభూ దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ ఖాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర్లో శ్వేతార్క గణపతి దేవాలయం ఒకటి. గుడిలోని విగ్రహాన్ని శిల్పీ చేక్కలేదు. తెల్ల జిల్లేడు మొదలుపై స్వయంగా వెలసిన శ్వేతార్క గణపతి.

శిల్పి రూపొందించిన విగ్రహం కంటే స్వయంగా వెలసినప్పుడు దాన్ని ఇంకా పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. చిత్రమేమిటంటే, కొన్ని స్వయంభూ దేవాలయాల్లా శ్వేతార్క గణపతిలో అస్పష్టత ఉండదు. ఖాజీపేట గణపతి తల, కళ్ళు, తుండము, ఒకటి పొడుగ్గా, మరొకటి విరిగినట్టుగా ఉండే రెండు దంతాలు, చేతులు, ఆసన భంగిమ, పాదాలు, మూషిక వాహనం... ఇలా ప్రతిదీ స్పష్టంగా విఘ్నేశ్వరుని పోలి ఉంటుంది.

శ్వేతార్క గణపతి దేవాలయాన్ని దర్శించుకున్నవారి కోరికలు తప్పక నెరవేరుతాయని ప్రశస్తి. చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఆరోగ్య సమస్యలు, కాపురంలో కలతలు - ఇలా అనేక సమస్యలతో గుడికి వచ్చే భక్తులు, తమకు వెంటనే సత్ఫలితాలు చేకూరినట్లు చెప్తారు.

ఎప్పుడూ రద్దీగా ఉండే శ్వేతార్క గణపతి దేవాలయం మంగళ వారాల్లో మరీ కిక్కిరిసి ఉంటుంది. మంగళవారం నాడు గరిక పూజలు, గణపతి హోమం జరుపుతారు.

ఖాజీపేటలోని రైల్వే కాంప్లెక్స్ లో శ్వేతార్క గణపతి దేవాలయంతో పాటు సీతారామ లక్ష్మణ, ఆంజనేయ ఆలయం, పద్మావతీ వేంకటేశ్వరాలయం, అయ్యప్ప ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, సాయిబాబా గుడి కూడా ఉన్నాయి. కాంప్లెక్స్ లో అడుగు పెట్టగానే మరో ప్రపంచంలోకి వెళ్ళినట్లు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.
గణేశ మంగళాష్టకమ్

గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే


గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్



నాగయజ్ఞోపవీతాయ నత విఘ్నవినాశినే

నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్



ఇభవక్త్రాయ ఇంద్రాది వందితాయ చిదాత్మనే
ఈశాన ప్రేమ పాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్

సుముఖాయ సుశుండా గ్రోత్ క్షిప్తామృత ఘటాయ ,
సురబృంద నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్

చతుర్భుజాయ చంద్రార్థ విలాసన్మస్తకాయచ,
చరణావనతానంత తారణాయాస్తు మంగళమ్

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ ,
విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్

ప్రమోదామోదరూపాయ సిద్ధి విజ్ఞాన రూపిణే
ప్రకృష్ట పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్

మంగళం గణనాథాయ మంగళం హరసూనవే
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్ర్తేస్తు మంగళమ్

శ్లోకాష్టమిదం పుణ్యం మంగళ ప్రదం మాదరాత్
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్న నివృత్తయే

ఇతి గణేశ మంగళాష్టకమ్





No comments:

Post a Comment