Tuesday, June 25, 2013

శ్రీమద్భగవద్గీత-సాంఖ్యయెగము(2)

శ్రీమద్భగవద్గీత
రెండవ అధ్యాయము- సాంఖ్యయెగము(2)

తేది
సంఖ్య
శ్లోకము
తెలుగులో
అర్దము
26.06.2013
38
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥२- ३८॥

సుఖదు:ఖే సమే కృత్వా లాభా లాభ్ జయాజయో I
తతో యుద్దాయ యుజ్యస్వనైవం పాపమవాస్స్యి I I

జయాపజయములను లాభనష్టములను, సుఖదుఖములను సమానముగ భావించి, యుద్దసన్నద్దుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటనే అంటవు.
27.06.2013
39





40
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥२- ३९॥
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो विद्यते
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥२- ४०॥



ఏషాతే భిహితా సాంఖ్యే బుద్దిర్యోగే త్విమాం శృణు I
బుద్ద్యాయుక్తోయయా పార్ద కర్మబంధం ప్రహాస్యసి I I
నేహభిక్రమనాశోస్తి ప్రత్యవాయో విద్యతే I
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయేతేఅ మహతో భయాత్ I I

పార్దా! (సమత్వ) బుద్దిని ఇంతవరకును జ్ఞానయోగదృష్టితో తెలిపితిని.ఇప్పుడు దానినే కర్మయోగదృక్పదముతో వివరిచెదను. దానిని ఆకళింపుచేసుకొని ఆచరించినచో కరంబంధముల నుండి నీవు ముక్తుడవయ్యెదవు. (నిష్కామ) కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికిని బీజనాశము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండవు. పైగా  (నిష్కామ) కర్మయోగమును కొంచెము సాధనచేసినను అది జన్మమృత్యురూప మహాభయమునుండి కాపాడును
28.06.2013
41
व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन
बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥२- ४१॥

వ్యవసాయాత్మికా బుద్ది: ఏకేహ కురునందన
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్దయోవ్యవసాయినాం
అర్జునా! (నిష్కామ) కర్మయోగమునందు నిశ్చయాత్మకబుద్ది ఒకతియే యుండును. కాని భోగాసక్తులైన వివేకహీనులబుద్దులు చంచలములైఒక దారితెన్నులేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచూ అనంతములుగా నుండును.
29.06.2013
42





43





44
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः
वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥२- ४२॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम्
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥२- ४३॥
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम्
व्यवसायात्मिका बुद्धिः समाधौ विधीयते ॥२- ४४॥

యామిమాంపుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చిత: I
వేదవాదరతా: పార్ద నాన్యదస్తీతి వాదిన: I I 2-42
కామాత్మాన: స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం I
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి I I 2-43
భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం I
వ్యవసాయాత్మికా బుద్ది: సమాధౌ విధీయతే I I 2-44

అర్జునా! వివేకహినులైన జనులు ప్రాపంచిక భోగములయందే తలమునకలై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యములయొక్క బాహ్యర్ధముల యందే ప్రీతి వహింతురు. వాటి అంతరార్ధముల జోలికేపొరు. స్వర్గమునకు మించినదేదియును లేదనియు, అదియే పరమప్రాప్యమనియు వారు భావింతురు. క్షణికములైన ప్రాపంచిక భోగైశ్వర్యములయందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించుచు ప్రీతిని గూర్చు ఇచ్చకపుపల్కులు పలికెదురు. ఇచ్చకపు మాటల ఉచ్చులలోబడిన భోగైశ్వర్యాసక్తులైన ఆజ్ఞానులబుద్దులు భగవంతుడు లక్ష్యముగాగల సమాధియందు స్దిరముగా ఉండవు.
30.06.2013
45
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥२- ४५॥

త్రైగుణ్యవిషయా వేదా నిస్రైగుణ్యో భవార్జునా I
నిర్ద్వంద్యో నిత్యసత్వ్తస్దో నిర్యోగక్షేమ ఆత్మవాన్ I I

అర్జునా! వేదములు సత్త్యరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్తభోగములకార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతి పాదించును. నీవు భోగములయెడలనువాటి సాధనలయందును ఆసక్తి నిత్యజింపుము. హర్షశోకాది ద్వంద్వములకు ఆతీతుడవు కమ్ము. నీ యోగ క్షేమముల కొఱకై  ఆరాటపడవద్దు.అంత:కరణమును వశమునందుంచుకోనుము.
01.07.2013
46
यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके
तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥२- ४६॥

యానానర్ద  ఉదపానే సర్వత: సంప్లుదతోదకే  I
తానాన్ సర్వేషు  వేదేషు బ్రాహ్మణస్య విజానత: I I.

 అన్నివైపులా జలములతో నిండి వున్నమహాజలాశయము అందుబాటులోవున్నవానికి చిన్న చిన్నజలాశయములవలన ఎంత ప్రయోజనమో, పరమాత్మప్రాప్తినంది పరమానందమును అనుభవింఛుబ్రహ్మజ్ఞానికి వేదములవలన అంతియో ప్రయోజనము.
02.07.2013
47
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२- ४७॥

కర్మణ్యేవాదికారస్తే మా ఫలేషు కదాచన I
మా కర్మఫలహేతుర్బూ: మా తే సంగో స్త్యకర్మణి I I

కర్తవ్యకరమునాచరించుటయందే నీకు అధికారముగలదు. ఎన్నటికిని దాని ఫలములయందు లేదు. కర్మఫలములకు నీవు హేతువు కారాదు. కర్మలను మానుటయందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్షరహితుడవై కర్తవ్యబుద్దితో కర్మలను ఆఛరించుము.
03.07.2013
48
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥२- ४८॥
యోగస్ద: కురుకర్మాణి సంగం త్వక్త్వా ధనంజయ
సిద్ద్యసిద్ద్యో: నమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే
  ధనంజయ! యోగస్దితుడవై ఆసక్తిని వీడి, సిద్ది - అసిద్దులయెడ సమత్వభావములను కలిగివుండి, కర్తవ్యకర్మలను ఆఛరింపుము. సమత్వభావనే యెగమందురు.
04.07.2013
49
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय
बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥२- ४९॥

దూరేణ హ్యవరం కర్మ బుద్దియోగాద్దనంజయ
బుద్దౌ శరణమన్విచ్ఛ కృపణా: ఫలహేతువ:
సమత్వబుద్దియోగము కంటెను సకామకర్మ మిక్కిలి నిమ్నశ్రేణికి చెందినది. కావున ధనంజయ! నీవు సమత్వబుద్దియోగమునే ఆశ్రయింపుము - ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు, కృపణులు.

05.07.2013
50
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥२- ५०॥

బుద్దియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ: కర్మసు కౌశలమ్

సమత్వబుద్దియుక్తుడైనవాడు పుణ్యపపాపములను రెండింటిని లోకమునందే త్యజింఛును.అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్దిరూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. అనగా కర్మ బంధములనుండి ముక్తుడగుటకు ఇదియే మార్గము.
06.07.2013
51
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः
जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम्
కర్మజం బుద్దియుక్తా హి ఫలం త్వక్త్యామనీషిణ:
జన్మబంధవినిర్ముక్తా:గచ్ఛంత్యనామయమ్

 సమ బుద్దియుక్తులైన జ్ఞనులు కర్మఫలములను త్యజింఛి జనన మరణబందములనుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమ్తెన పరమపదమును పొందుదురు.
07.07.2013
52
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति
तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य ॥२- ५२॥
యదా తే మోహకలిలం బుద్దిర్వ్యతిరిష్యతి
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్వ సశ్రుతస్య

మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటబదడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహలోకపరలోక సంబంధమైన సమస్తభోగములనుండి వైరాగ్యము పోందగలవు.
08.07.2013
53
श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला
समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥२- ५३॥

శ్రుతివప్త్తిపన్నా తే యదా స్ధాస్యతి నిశ్ఛలా
సమాధావఛలా బుద్దిస్తదా యోగ మవాస్స్యసి

 నానావిధముల్తెన మాటలను వినుట వలన విఛలితమైన నీ బుద్ది పరమాత్మయందు నిశ్చలముగా స్దిరముగావున్నపుడే నీవు యోగమును పోందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును.
09.07.2013
55
प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान्
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥२- ५५॥

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్ద మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్ట: స్దితప్రజ్ఞస్తదోచ్యతే

అర్జునా! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తోలిగిపోయి, ఆత్మద్వారా ఆత్మయందుసంతుష్టుడైనవానిని, అనగా పరమాత్మసంయేగమువలన ఆత్మానందమును పోందినవానిని స్దితప్రజ్ణుడని యందురు
10.07.2013
56
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥२- ५६॥

దు:ఖేష్వమద్విగ్నమనా: సుఖేషు విగతస్సృహ:
వీతరాగభయక్రోధ: స్దితధీర్మునిరుచ్యతే

దు ;ఖములకు క్రుంగిపోనివాడును, సుఖములకు పోంగిపోనివాడును, ఆసక్తిని, భయక్రోధములను వీడినవాడును ఐనట్టి మననశీలుడు స్ధితప్రజ్ఞుడనబడును.
11.07.2013
57
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम्
नाभिनन्दति द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ५७॥

: సర్వత్రానభిస్నేహ: తత్తత్ ప్రాప్య శుభాశుభమ్
నాభినందతి ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా:

దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్టితులయందు హర్షము, ప్రతికూలపరిస్టితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగానివాడును అగు పురుషుడు స్టితప్రజ్ఞడు అనబడును.
12.07.2013
58
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ५८॥

యదా సంహరతే ఛాయం కూర్మోంగానీన సర్వశ:
ఇంద్రియాణీంద్రియార్దేభ్య: తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా

తాబేలు తన అంగములను అన్నివైపులనుండి లోనికి ముడుఛుకొనునట్లుగా, ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి  అన్నివిధముల ఉపసంహరింఛుకొనిన పురుషుని యొక్కబుద్ది స్టిరముగా ఉన్నట్లు భావించవలెను
13.07.2013
59
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः
रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥२- ५९॥

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన:
రసవర్జజం రసోప్యస్య పరం దృష్ట్వ నివర్తతే

ఇంద్రియములద్వారా విషయములను గ్రహింపనివానినుండి ఇంద్రియార్డములు మాత్రమే వైదొలుగును. కాని వాటిపై ఆసక్తిమిగిలివుండును. స్దితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారము అయునందువలన వానినుండి ఆసక్తి కూడా తొలిగిపోవును
14.07.2013
60
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः
इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥२- ६०॥

యతతో హ్యాపి కౌంతేయ పురుషస్య విపశ్చిత:
ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మన:

అర్జునా! ఇంద్రియములుప్రమధనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగి పోనంతవరకును అవి అతనిమనస్సును ఇంద్రియార్దముల వైపు లాగికొనిపొవుచునేవుండును
15.07.2013
61
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६१॥

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర:
నశే హి  యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా :

కనుక సాధకుడు ఆఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకొని, సమాహితచిత్తుడై (చిత్తమును పరమాత్మయందులగ్నముచేసినవాడైమత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొన వలెను.ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుద్ది స్దిరముగావుండును.
16.07.2013
62
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः
वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६१॥

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర:
నశే హి  యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా :

కనుక సాధకుడు ఆఇంద్రియములను అన్నింటిని వశమునందుంచుకొని, సమాహితచిత్తుడై (చిత్తమును పరమాత్మయందులగ్నముచేసినవాడైమత్పరాయణుడై, ధ్యానమునందు కూర్చొన వలెను.ఏలనన ఇంద్రియములను వశమునందుంచుకొనువాని బుద్ది స్దిరముగావుండును.
17.07.2013
63
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥२- ६३॥

క్రోధాద్భవతి సమ్మోహ: సమ్మోహాత్ స్మృతివిభ్రమ:
స్మృతిభ్రంశాద్బుద్ది నాశో బుద్దినాశాత్ ప్రణశ్యతి 

అట్టి క్రోధమువలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ది అనగా జ్ఞానశక్తి నశించును. బుద్దినాశమువలన మనుష్యుడు
తన స్దితినుండి పతనమగును.
18.07.2013
64
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन्
आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥२- ६४॥

రాగద్వేషవియుకైస్తు విషయానింద్రియైశ్చరన్
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి

అంత:కరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పోందును.
19.07.2013
65
प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते
प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥२- ६५॥

ప్రసాదే సర్వదు:ఖానాం హాని రస్యోపజాయతే
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ది: పర్యవతిష్టతే

మన: ప్రసన్నతను పోందిన వెంటనే అతనిదు:ఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయేగియొక్క బుద్ది అన్నివిషయములనుండి వైదొలగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్దిరమగును.
20.07.2013
66
नास्ति बुद्धिरयुक्तस्य चायुक्तस्य भावना
चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥२- ६६॥

నాస్తి బుద్దిరయుక్తస్య చాయుక్తస్య భావనా
చాభావయత; శాంతి: అశాంతస్య కుత: సుఖమ్

ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చియాత్మక బుద్ది ఉండదు. అట్టి అయుక్తమనుష్యుని అంతకరణమునందు ఆస్తికభావము కలగదు. తద్భావనాహీనుడైనవానికిశాంతి లభంపదు. మనశ్శాంతిలేనివారికి సుఖము ఎట్లు లభించును.?
21.07.2013
67
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते
तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥२- ६७॥

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి

నీటిపై తేలుతున్న నావను గాలినెట్టివేయును. అట్లే ఇంద్రియార్దములయందు సంచరించు ఇంద్రియములలొ మనస్సు ఏఒక్క ఇంద్రియముతోకూడివున్నను ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజునిబుద్దిని అనగావిచక్షణా శక్తిని హరించివేయును.
22.07.2013
68
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२- ६८॥

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశ:
ఇంద్రియాణీంద్రియార్ధేభ: తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా
కనుక అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్దములనుండి అన్నివిధములుగ పూర్తిగా నిగ్రహించిన పురుషునియెక్క బుద్ది స్దిరముగా వుండును.

23.07.2013
69
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥२- ६९॥

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్ర్తి భూతాని సా నిశా పశ్యతో మునే:

నిత్యజ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తియందు స్ధితప్రజ్ఞుడైన యోగి మేల్కోనివుండును. అది ఇతర ప్రాణులన్నింటికిని రాత్రితొ సమానము. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుఛు ప్రాణులన్నియుమేల్కొకొనివుండును. అది పరమాత్మత్వమెరిగిన మునికి రాత్రితొ సమానము.
24.07.2013
70
आपूर्यमाणमचलप्रतिष्ठं  समुद्रमापः प्रविशन्ति यद्वत्
तद्वत्कामा यं प्रविशन्ति सर्वे   शान्तिमाप्नोति कामकामी ॥२- ७०॥

ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాస: ప్రవిశంతి యద్వత్
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వేస శాంతిమాప్నోతి కామకామీ

సమస్తదిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగావున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండనె అందులొ లీనమగును. అట్లే సమస్త భోగములను స్ధితప్రజ్ఞునియందు ఎట్టి వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును.. భోగాసక్తుడు శాంతిని పోందజాలడు.
25.07.2013
71
विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः
निर्ममो निरहंकारः शान्तिमधिगच्छति ॥२- ७१॥

విహయ కామాన్ : సర్వాన్ పుమాంశ్చరతి ని:స్వృహ:
నిర్మమో నిరహంకార: శాంతిమధిగచ్చతి
కోరికలన్నింటిని త్యజించి మమతా. అహంకార, స్సృహారహితుడై చరించున్నట్టి పురుషుడే శాంతిని పోందును.

26.07.2013
72
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति
स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥२- ७२॥

ఏషా బ్రాహ్మీ స్దితి: పార్ద నైనాం ప్రాప్య విముహ్యతి
స్దిత్వాస్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి

అర్జునా! బ్రాహ్మీస్దితి యనగా ఇదియే. బ్రాహ్మీస్దితిని పొందిన యెగి ఎన్నడును మోహితుడు కాడు.. అంత్యకాలమునందును బ్రాహ్మీస్దితియందు స్దిరముగానున్నవాడు బ్రహ్మనందము పోందును.

ఓం తత్సదితి శ్రీమద్బగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయం యోగశాస్ర్తే శ్రీకృష్ణార్జునసంవాదే సాంఖ్యయోగోనామ ద్వితియోద్య్హాయ:


No comments:

Post a Comment